News October 30, 2025
VKB: నిరసన దీక్షకు అనుమతి ఇవ్వాలని ఎస్పీకి వినతి

కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యచరణ కమిటీ కో కన్వీనర్ గంటి సురేష్ కుమార్, రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్పీ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు ఇతర ప్రాంతాలకు తరలిస్తారని వస్తున్న వార్తలకు నిరసనగా నవంబరు 1 నుంచి 10 వరకు చేపట్టనున్న నిరసన దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యనాయక్, భీమరాజు, నవాజ్ తదితరులు ఉన్నారు.
Similar News
News October 30, 2025
వెల్లటూరు కాలువలో పడి వ్యక్తి మృతి

కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. భట్టిప్రోలు ఎస్ఐ శివయ్య వివరాల మేరకు.. వెల్లటూరుకు చెందిన కొలుసు వెంకటేశ్వరరావు (39) 9 తూముల పంట కాలువ వద్దకు బహిర్గత భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో అతనికి ఫిట్స్ రావటం వలన ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడు తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 30, 2025
రంపచోడవం ఓఎస్డీ విశాఖ డీసీపీ-1గా బదిలీ

రంపచోడవరం ఆపరేషన్స్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ), అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ జగదీశ్ అడహళ్లి విశాఖపట్నం డీసీపీ-1 (లా అండ్ ఆర్డర్)గా బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జగదీశ్ అడహళ్లి యూపీఎస్సీ పరీక్షల్లో 440వ ర్యాంకు సాధించారు. అల్లూరి జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు.
News October 30, 2025
మంచిర్యాల: పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి: MCPIU

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాల కారణంగా విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సెలవులు ప్రకటించాలని కోరారు.


