News March 18, 2025

VKB: నిరీక్షణకు ఫలితం దక్కింది 

image

దుద్యాలకి చెందిన మాసుల పద్మమ్మ, చిన్న సాయన్న కొడుకు మాసుల శశివర్ధన్ నిరీక్షణకు ఫలితం దక్కింది. 11 సంవత్సరాలుగా విద్యాశాఖలో సీఆర్పిగా విధులు నిర్వర్తిస్తూ చదివి హాస్టల్ వెల్ఫేర్ జాబ్ సాధించాడు శశివర్ధన్. తల్లిదండ్రులు కలను నెరవేర్చాడు. అతణ్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు. 

Similar News

News March 18, 2025

రంగారెడ్డి: 2nd ఇయర్ పరీక్షకు 2,399 మంది డుమ్మా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో 73,192 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,793 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,399 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

News March 18, 2025

కృష్ణా: పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు- కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.

News March 18, 2025

IPLలో అత్యధిక ఫోర్లు కొట్టింది ఇతనే!

image

17 సీజన్లుగా ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPLలో వందల కొద్దీ రికార్డులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటి వరకు అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ల గురించి తెలుసుకుందాం. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్‌ది. ఈయన 222 మ్యాచుల్లో 768 ఫోర్లు కొట్టారు. డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ, ముంబై, పంజాబ్, హైదరాబాద్ జట్ల తరఫున ఆడారు. అతని తర్వాత కోహ్లీ(705), వార్నర్(663), రోహిత్(599), రైనా (506) ఉన్నారు.

error: Content is protected !!