News April 10, 2025
VKB: నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలి: కలెక్టర్

గర్భవతులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్య అధికారికి సూచించారు. గురువారం కోట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరీక్షలు నిర్వహించాలన్నారు. కావాల్సిన ఐరన్, క్యాల్షియం, విటమిన్ మందులను అందించాలని తెలిపారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలన్నారు.
Similar News
News April 18, 2025
చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్‌లైన్ అడ్మిషన్లు

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.
News April 18, 2025
సంగారెడ్డి: పాము కాటుకు రైతు మృతి

పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన హత్నూర మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. నాగుల్ దేవుపల్లికి చెందిన దూడి అంజయ్య (46) గురువారం రాత్రి పొలానికి వెళ్లగా అక్కడ కాలుకి పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News April 18, 2025
ICDS నెల్లూరు PDగా సువర్ణ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సువర్ణ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో పీడీగా విధులు నిర్వహిస్తున్న సుశీల అనారోగ్యంతో సెలవుపై వెళ్లారు. ఇన్‌ఛార్జ్ పీడీగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొనసాగుతున్నారు. దీంతో సువర్ణను రెగ్యులర్ పీడీగా నియమించారు.