News December 15, 2025

VKB: నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి రేపు రద్దు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున తాత్కాలికంగా రేపటి సోమవారం ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని తెలిపారు. యధావిధిగా మళ్లీ ప్రతి సోమవారం ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News December 20, 2025

చిత్తూరు: ‘బాలికను గర్భిణీని చేశాడు’

image

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని పోక్సో కేసులో అరెస్ట్ చేసినట్టు నగిరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ తెలిపారు. వెదురుకుప్పం మండలంలోని 14 ఏళ్ల బాలికపై మురళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో గర్భం అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

News December 20, 2025

నల్గొండ: త్వరలో సహకార ఎన్నికలు..!

image

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏడాదిన్నర కిందటే వాటి పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 110 పీఏసీఎస్‌లు ఉండగా సూర్యాపేట జిల్లాలో 47, నల్గొండలో 42, యాదాద్రిలో 21 ఉన్నాయి. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఈసారి పొడిగించకుండా ఎన్నికలు నిర్వహించనుంది.

News December 20, 2025

గోరంట్ల: ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష

image

కర్ణాటక మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న గోరంట్లకు చెందిన చాకలి మురళి, వడ్డే నరేష్‌లకు పెనుకొండ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2020లో 192 హేవార్డ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు తరలిస్తుండగా అప్పటి సీఐ జయనాయక్ వీరిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో మెజిస్ట్రేట్ బొజ్జప్ప నిందితులకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున భారీ జరిమానా విధించారు.