News August 13, 2025

VKB: ‘పంచాయతీ అధికారులు రానున్నారు’

image

గ్రామాలకు పంచాయతీ అధికారులు వస్తున్నందున క్లస్టర్ వారిగా వివరాలను రూపొందించాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారిగా క్లస్టర్లను రూపొందించాలని, గ్రామపంచాయతీ అధికారులు వస్తున్నందున వారి కేటాయింపులకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Similar News

News August 13, 2025

కడెం: 3 గేట్ల ద్వారా నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరగడంతో మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టులోకి 40,066 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎడమ కాలువకు 384, కుడి కాలువకు 20, మిషన్ భగీరథకు 9, దిగువకు 17,601 క్యూసెక్కులు వదులుతున్నారు.

News August 13, 2025

అల్లూరి: యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

image

యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ దినేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం పాడేరులో కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మేరకు, ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రెండు వారాల పాటు జరుపుకోవాలని తెలియజేశారు.

News August 13, 2025

HYD: ఇస్రో ఛైర్మన్‌కు డాక్టరేట్: VC కుమార్

image

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించింది. ఈనెల 19న జరగనున్న ఓయూ 84వ స్నాతకోత్సవంలో ఓయూ కులపతి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ (డాక్టరేట్ ఆఫ్ సైన్స్) అందించనున్నట్లు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం తెలిపారు. ఇస్రో ఛైర్మన్‌కు డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.