News February 17, 2025
VKB: పన్ను వసూలులో వెనుక ఉన్న మండలాలు ఇవే..!

వికారాబాద్ జిల్లాలో 2024-25లో మర్పల్లి, తాండూర్, పెద్దముల్, కొడంగల్, పూడూర్, యాలాల్, దౌల్తాబాద్, పరిగి, దోమ, మోమిన్ పేట్, బొమ్రాస్ పెట్, కులక్చర్ల, కోటపల్లి మండలాలు పంచాయతీ పన్నువసూళ్ల వెనుకంజలో ఉన్నాయి. పన్ను వసూలులో ప్రధాన కారణం గ్రామాల్లో వివిధ రకాల సర్వేలు నిర్వహించడంతో ఆలస్యమైనట్లు పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
Similar News
News December 13, 2025
జగిత్యాల: పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సిబ్బంది

జగిత్యాల జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది, సామగ్రి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. జగిత్యాల, జగిత్యాల రూరల్, సారంగాపూర్, మల్యాల, బీర్పూర్, రాయికల్, కొడిమ్యాల మండలాల్లోని 144 సర్పంచ్, 1276 వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1276 పోలింగ్ కేంద్రాలకు 1531 పీఓలు, 2036 ఏపీఓలు, రిటర్నింగ్ అధికారులు వాహనాల్లో చేరుకున్నారు.
News December 13, 2025
SKLM: ‘సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతల్లేకుండా చేయాలి’

సంక్రాంతి పండగ నాటికి జిల్లాలోని రహదారులను గుంతలు లేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్‌తో కలిసి ఆయన ఆర్అండ్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రూ.82 కోట్ల విలువైన 28 పనులు మంజూరయ్యాయని అన్నారు.
News December 13, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాలీలు, గుంపులపై నిషేధం: ఎస్పీ

నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకూడదని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జిల్లాలో BNSS 163 అమలులో ఉన్నందున, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా, డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.


