News March 19, 2025
VKB: పరీక్షల నిర్వహణకు అధికారుల నియామకం

వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలన కోసం పలు అధికారులను నియమించారు. అందులో 20 మంది MROలు, 20 మంది MPDOలు, 20 మంది MEOలు, 69 మంది చీఫ్ సూపరింటెండెంట్, 69 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, 8మంది పోలీస్ స్టేషన్ కస్టోడియన్స్, 13మంది రూట్ ఆఫీసర్స్, 69మంది సెట్టింగ్స్ స్వీట్స్, 10మంది ఫ్లైయింగ్ స్పాట్స్, 732మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు.
Similar News
News September 17, 2025
నిజాంకు వ్యతిరేకంగా దామెరకుంట వాసుల పోరుబాట!

నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కాటారం మండలం దామెరకుంట వాసులు కీలకపాత్ర పోషించారు. వారిలో రాగం వెంకటయ్య, ఐత చిన్న పోచిరెడ్డి, పెద్ద పోచిరెడ్డి, రాజిరెడ్డి, బాసాని బక్క రాజయ్య, కోడిపెల్లి వెంకటయ్య సహా పలువురు యోథులు ఉన్నారు. ఈ పోరాటంలో ఐత చిన్న పోచిరెడ్డిని ధన్వాడ వద్ద రజాకార్లు చంపడం గ్రామంలో విషాదం నింపింది.
News September 17, 2025
అనకాపల్లి: 30 రోజుల్లో 14,86,513 మహిళలు ఉచిత ప్రయాణం

స్త్రీ శక్తి పథకం కింద అనకాపల్లి జిల్లాలో గల నర్సీపట్నం, అనకాపల్లి డిపోల నుంచి నడుస్తున్న బస్సుల్లో నెల రోజుల్లో 14,86,513 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి వి.ప్రవీణ తెలిపారు. ఈ మేరకు మహిళలు రూ.5.35 కోట్ల మేర లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగిందన్నారు. అనకాపల్లి డిపోలో 100% ఓఆర్ నమోదు అయిందన్నారు.
News September 17, 2025
ADB: తెలంగాణకు అండ.. కొండా లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. ASF(D)లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆది గురువుగా నిలిచారు. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించడమే కాక.. టీఆర్ఎస్ ఆవిర్భావంలోనూ కీలకంగా వ్యవహరించారు. 96 ఏళ్లప్పుడూ స్వరాష్ట్రం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు.