News April 24, 2025

VKB: పురుగుమందు తాగిన కాంగ్రెస్ నాయకుడు

image

బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. అధికార పార్టీలోని కొందరి వల్ల మనస్తాపం చెందిన ఓ నాయకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గురువారం జరిగిన ఎమ్మెల్యే కార్యక్రమంలో మైలవర్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డికి వేదికపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడంతో మనస్తాపంతో పురుగుమందు తాగాడు. వైద్యం కోసం VKB ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 24, 2025

యుద్ధానికి రెడీ అవుతున్న భారత్?

image

పాకిస్థాన్‌పై విరుచుకుపడేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. LoC, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించడంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని (సీజ్ ఫైర్) రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అటు హిందూ, అరేబియా సముద్రాల్లో నేవీ మోహరించినట్లు వార్తలొస్తున్నాయి. INS విక్రాంత్‌ పాకిస్థాన్ వైపు వెళ్తోందని సమాచారం. ఇక వైమానిక దళం రఫేల్ యుద్ధవిమానాలను పలు ఎయిర్‌బేస్‌లకు తరలించింది.

News April 24, 2025

బీచ్ కబడ్డీకి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక

image

కాకినాడలో మే 2 నుంచి 4 వరకు జరిగే అంతర్ జిల్లా బీచ్ కబడ్డీ పోటీలకు ఉమ్మడి గుంటూరు జిల్లా పురుషులు, మహిళల జట్లు ఎంపికయ్యాయి. గురువారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన సెలెక్షన్స్‌లో 9 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఎంపికయ్యారు. అనంతరం ఇండియా క్యాంప్‌నకు ఎంపికైన గోపీచంద్‌ను సన్మానించారు. కబడ్డీ సంఘ నాయకులు, కోచ్‌లు, పీడీలు పాల్గొన్నారు.

News April 24, 2025

IPL: ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RRతో జరిగిన మ్యాచ్‌లో RCB 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(70), దేవదత్ పడిక్కల్(50) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 26 పరుగులతో శుభారంభం అందించారు. చివర్లో టిమ్ డేవిడ్(23), జితేశ్ శర్మ(20*) బౌండరీలతో మెరిపించారు. సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. RR టార్గెట్ 206.

error: Content is protected !!