News April 3, 2025
VKB: పెద్దేముల్‌లో మిస్టరీగా మహిళ మృతి!

పెద్దేముల్ మండల కేంద్రంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. సదరు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. DSP బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందం వివరాలు సేకరించారు. మహిళ ముఖం, చేతిని కాల్చివేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Similar News
News April 4, 2025
భారీ వర్షాలు.. ఈ నంబర్‌కు కాల్ చేయండి: GHMC

TG: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో GHMC కమిషనర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏవైనా వర్ష సంబంధిత సమస్యలు ఉంటే సాయం కోసం 040-21111111 నంబర్‌ను సంప్రదించాలని సిటిజన్లకు సూచించారు. ఇప్పటికే నీరు నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేసినట్లు తెలిపారు.
News April 4, 2025
ADB: ‘ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలి’

ఓపెన్ స్కూల్ సోసైటి ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ కే.శ్యామలాదేవి అన్నారు. గురువారం వివిధ పరీక్ష నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు 623 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 465 మంది హాజరవుతారన్నారు. వీరికి ఏప్రిల్ 20వ తేది నుంచి ఏప్రిల్ 26 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.
News April 4, 2025
NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఎస్ఐ వివరాలు గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.