News September 17, 2025
VKB: పోరాట యోధుడు దొండేరావ్ జాదవ్

వికారాబాద్ గాంధీ కాలనీకి చెందిన దొండేరావ్ జాదవ్ నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1947 SEP 17న అరెస్టయ్యారు. గుల్బర్గా జైలులో నిర్బంధం ఎదుర్కొన్నారు. 1948లో సర్దార్ పటేల్ సైనిక చర్యతో TG భారతదేశంలో విలీనమైంది. ఆయన విడుదలయ్యారు. త్యాగానికి గుర్తుగా ప్రభుత్వం తామ్రపత్రం ప్రదానం చేసింది. వికారాబాద్‌లో శిలాఫలకం ఏర్పాటు చేసింది.
Similar News
News September 17, 2025
నల్గొండ: భూస్వామ్య కుటుంబంలో పుట్టి వారినే ఎదిరించాడు

నిజాం అనుచరులను ఎదిరించడంలో వేములపల్లి (M) రావులపెంట దళం ప్రధాన పాత్ర పోషించింది. అక్రమ వసూళ్లు, హత్యలు,అత్యాచారాలతో విసిగిన ప్రజలు తిరగబడ్డారు. రావులపెంట భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సీతారాంరెడ్డి ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. నిజాంను ఎదిరించేందుకు క్యాంపులు ఏర్పాటు చేసి దాడులు చేశారు. గ్రామంలోని కోటబురుజును కేంద్రంగా చేసుకొని పాములపాడు, ఆమనగల్లులో దళాలను ఏర్పాటు చేసి రజాకార్లను తరిమికొట్టారు.
News September 17, 2025
భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం వివరాలివే!

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 205.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహదేవపూర్ 39.4, పలిమెల 10.6, మహముత్తారం 18.6, కాటారం 34.8, మల్హర్ 3.6, చిట్యాల 8.2, టేకుమట్ల 26.8, మొగుళ్లపల్లి 11.0, రేగొండ 11.4, గణపురం 14.8, భూపాలపల్లి 26.2 మి.మీ.లుగా నమోదైంది.
News September 17, 2025
BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.