News January 1, 2025
VKB: పోస్టల్ ద్వారా పాస్ పోర్ట్ సేవలు

VKB జిల్లా కేంద్రంలో పోస్టల్ ద్వారా పాస్ పోర్ట్ సేవలు అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. పాస్ పోర్ట్ రీజినల్ ఆఫీసర్ స్నేహజ, సీపీవో శ్రీనివాస్ కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. HYD నగరంలో జరిగిన చర్చల్లో, రాష్ట్రవ్యాప్తంగా 14 పోస్టల్ పాస్ పోర్ట్ సేవ కేంద్రాల ద్వారా సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వికారాబాద్‌లో గతంలో రోజుకు 40 స్లాట్లు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 80కి పెంచామన్నారు.
Similar News
News February 13, 2026
BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 47 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్ ఒక్క చోట హంగ్ ఏర్పడింది. అటు మేడ్చల్‌లోని అలియాబాద్ మున్సిపాలిటీలోనూ హంగ్ వచ్చింది.
News February 13, 2026
రంగారెడ్డి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 59 వార్డుల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 24 కాంగ్రెస్, 23 BRS, 7 BJP, ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం చేసుకుంది. చేవెళ్లలో 4 INC, 4 BRS, 1 BJP గెలిచాయి. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. ఆమన్‌గల్లులో INC బోణీ చేయలేదు. శంకర్‌పల్లిలో హోరా హోరీ నడుస్తోంది.
News February 13, 2026
రంగారెడ్డి: ఓట్ల లెక్కింపు 64 టేబుళ్లు ఏర్పాటు

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులుండగా వీటిల్లో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లులో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 265 మందిని నియమించారు.


