News August 18, 2025

VKB: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం: కలెక్టర్

image

ప్రజావాణికి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి 45 ఫిర్యాదు వచ్చాయన్నారు. రైతుల భూ సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలన్నారు.

Similar News

News August 18, 2025

SRSP 39 గేట్లు ఓపెన్!

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు 39 గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. తద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1,25,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1089.1 అడుగుల(73.749 TMC) నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.

News August 18, 2025

హక్కుల సాధనకు సంఘటితమవుదాం

image

విచ్ఛిన్నకర శక్తులకు శాంతి మార్గంలో తగిన గుణపాఠం చెప్పేందుకు తమ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ముందుకు సాగుతోందని జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. సోమవారం ఖమ్మం నిజాంపేట ప్రాంత నూతన కమిటీని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. హక్కుల సాధనకు సంఘటితమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

News August 18, 2025

కానూరు-మచిలీపట్నం రోడ్డు విస్తరణతో ట్రాఫిక్‌కు చెక్

image

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి లోకేశ్ సోమవారం ఢిల్లీలో కలిశారు. కానూరు-మచిలీపట్నం రహదారిని విస్తరిస్తే విజయవాడ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, రాజధాని అభివృద్ధికి తోడ్పడుతుందని లోకేశ్ వివరించారు. అలాగే, హైదరాబాద్-అమరావతి అనుసంధానంలో ముఖ్యమైన NH-65లో అదనపు పోర్టు లింకేజీని DPRలో చేర్చాలని కోరారు. గ్రీన్ కారిడార్లు, టోలింగ్, ట్రాఫిక్ వ్యవస్థల అభివృద్ధిలో కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.