News February 17, 2025

VKB: ‘ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి’

image

ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో జిల్లాలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 98 ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లాలో పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూసమస్యలపై ఫిర్యాదులను పరిశీలించారు. ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు.

Similar News

News September 13, 2025

విజయవాడ: బ్యాంక్ అకౌంట్‌ ఉందా..ఇది మీ కోసమే

image

సాధారణ ప్రజలను డబ్బులిచ్చి మభ్యపెట్టి వారి బ్యాంక్ ఖాతాను సైబర్ నేరస్తులకు అప్పగిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తాడి పరశురామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు ముఠాలోని ఇద్దరిని పట్టుకుని బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతా మొత్తం కిట్ ఆ ముఠాకు ఇస్తే రూ.10 వేలు ఇస్తామని నేరస్తుల ముఠా మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది.

News September 13, 2025

సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

image

వలస వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట తీసుకుపోకుండా ఈ ఏడాది జిల్లాలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నట్లు డీఈవో శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుర్నూలు జిల్లాలో ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. హాస్టళ్లు నిర్వహించేందుకు ఆసక్తి ఉండి, సేవాభావం కలిగిన పొదుపు, ఎన్జీవో సంఘాలు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News September 13, 2025

తిరుమల: భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూలైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. 69,842 మంది స్వామివారిని దర్శించుకోగా.. 28,234 మంది తలనీలాలు సమర్పించారు.