News April 25, 2025

VKB: బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు: అదనపు కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో బాల్య వివాహల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహలను నిర్మూలించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ సూచించారు.

Similar News

News April 25, 2025

పెద్దపల్లి: 28న యువ వికాసం దరఖాస్తుల పరిశీలన: కమిషనర్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఈ నెల 28వ తేదీన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. పరిశీలన అనంతరం అర్హుల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేలకు పైగా దరఖాస్తులు అందాయని తెలిపారు. అర్హత ప్రమాణాల ఆధారంగా దరఖాస్తులను సక్రమంగా పరిశీలిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

News April 25, 2025

పెద్దపల్లిలో పహల్గం మృతులకు జర్నలిస్టుల నివాళులు

image

పహల్గం ఘటనలో మృతిచెందిన భారతీయులకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద జర్నలిస్టులు గురువారం రాత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దేశ భద్రతతో రాజీపడకుండా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శత్రుదేశం వెన్నులో వణుకు పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News April 25, 2025

నిర్మల్: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి

image

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలో దారుణం జరిగింది. మల్లాపూర్ గ్రామంలో కన్నకొడుకు గొడ్డలితో నరికి తండ్రి హత్య చేశాడు. గ్రామానికి చెందిన బైనం అశోక్ (29)ను అతని తండ్రి బైనం ఎర్రన్న ఇవాళ ఉదయం హత్య చేశాడని గ్రామస్థులు పేర్కొన్నారు. చంపిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెల్లి లొంగిపోయాడు. ఎస్ఐ రహమాన్ మాలిక్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!