News March 18, 2025
VKB: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి

వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నియామకమయ్యారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్, సదానందరెడ్డి, రమేశ్, కేపీ రాజు, వడ్ల నందు, రాజశేఖర్ రెడ్డి పోటీ పడ్డారు. కాగా అధ్యక్ష పదవి రాజశేఖర్ రెడ్డికి వరించింది. తన నియామకానికి సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 18, 2025
SHOCKING.. మోమోస్ తయారీ కేంద్రంలో కుక్క మాంసం!

పంజాబ్‌లో మటౌర్‌లోని ఓ ఫ్యాక్టరీలో కుక్క మాంసం కలకలం రేపింది. మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో అధికారులు తనిఖీలు చేయగా ఫ్రిడ్జిలో కుక్క తల కనిపించింది. దీంతో పాటు కొంత మాంసాన్ని గుర్తించారు. ఆ తలను టెస్టుల కోసం పంపించారు. కాగా ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా చోట్లకు మోమోస్, స్ప్రింగ్ రోల్స్ పంపిస్తారని సమాచారం. మోమోస్ తయారీలో కుక్క మాంసాన్ని ఉపయోగించారా? అనేది తెలియాల్సి ఉంది.
News March 18, 2025
WGL: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా అపర్ణ

వరంగల్ అబ్బనికుంట ప్రాంతానికి చెందిన రాసం అపర్ణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షల్లో జోన్- 4లో 38వ ర్యాంక్, మహిళా విభాగంలో 7వ ర్యాంక్ సాధించారు. తన భర్త సంతోష్, కుటుంబసభ్యుల సహకారంతో ఎలాంటి కోచింగ్ లేకుండానే ఉద్యోగం సాధించానని అపర్ణ చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.
News March 18, 2025
‘X’ వేదికగా రామ్మూర్తి నాయుడుకు సీఎం నివాళులు

‘X’ వేదికగా సోదరుడు రామ్మూర్తి నాయుడుకు సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. తన కుటుంబంలోనే కాకుండా ప్రజాక్షేత్రంలో రామ్మూర్తి నాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని తెలిపారు. ఆయన స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.