News October 28, 2025
VKB: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సూచనలు

భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు, అధికారులు ఇచ్చే సూచనలు. ✓అవసరమైతే మినహా ఇళ్ల నుంచి బయటికి రావద్దు ✓నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నాలు చేయవద్దు ✓సెల్ఫీలు, రిల్స్ కోసం సాహసాలు చేయవద్దు ✓విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు ✓ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, చెరువులు, దగ్గరికి వెళ్లొద్దు ✓ మ్యాన్ హోల్స్ గుంతల పట్ల జాగ్రత్తగా ఉండండి.
Similar News
News October 29, 2025
సంగారెడ్డి: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 వయసు గల పురుష అభ్యర్థులు అర్హులు. 10 క్లాస్ పాసై, తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. శిక్షణ సమయంలో వసతి భోజనం ఉచితంగా ఇస్తామన్నారు.
News October 29, 2025
అంగన్‌వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

TG: అంగన్‌వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
News October 29, 2025
కావలిలో భారీ వర్షపాతం నమోదు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.


