News October 22, 2025
VKB: భూభారతి ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

రైతుల భూ సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో భూభారతి చట్టం ద్వారా స్వీకరించిన భూ సమస్యల పరిష్కారంపై ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని, దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా పరిష్కరించాలని సూచించారు.
Similar News
News October 23, 2025
మంచిర్యాల: వైన్స్ దరఖాస్తులు నేటితో పూర్తి

గురువారంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయడానికి గడువు ముగుస్తుందని జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. బుధవారం మద్యం దుకాణాలకు 7 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో మొత్తం జిల్లాలో మద్యం దుకాణాలకు 949 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 27న షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు.
News October 23, 2025
తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితకథ.. టైటిల్ రోల్‌లో స్టార్ హీరో

ప్రజానాయకుడు, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా పేరున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ మేరకు మూవీ యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి పరమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు శాసనసభ నుంచి ఐదు సార్లు MLAగా ఎన్నికయ్యారు.
News October 23, 2025
ములుగు: ఇకనుంచి జరిమానా కాదు.. వాహనం సీజ్!

అక్రమ వసూళ్లకు ఆర్టీవో చెక్ పోస్ట్‌లు కేరాఫ్‌గా మారాయనే ఆరోపణల నేపథ్యంలో వాటిని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, ములుగు(D)లో మొదటినుంచి ఒక్క చెక్ పోస్ట్ లేదు. ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దును పంచుకుంటున్న జిల్లా మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఏపీ వాహనాలు వచ్చిపోతుంటాయి. నిఘాను పెంచిన అధికారులు పర్మిట్ లేకుంటే ఇకనుంచి జరిమానా కాకుండా ఏకంగా వాహనాన్ని సీజ్ చేయనున్నారు.


