News March 8, 2025
VKB: మహిళలు లక్ష్యాన్ని అలవొకగా ఛేదిస్తారు: జ్వాలా

మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.
Similar News
News February 16, 2026
మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలో టాస్క్ ఫోర్స్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి శనివారం ఒక వసతి గృహాన్ని, ఒక గురుకుల పాఠశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి నివేదిక ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
News February 16, 2026
భైంసాలో బద్దలైన మజ్లిస్ కోట

TG: నిర్మల్ (D) భైంసా మున్సిపల్ ఛైర్మన్ పీఠం గత 20 ఏళ్లుగా MIM చేతుల్లోనే ఉండేది. తాజా ఎన్నికల్లో 26 వార్డులకు గాను MIM 12, BJP 6, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 7 చోట్ల గెలిచారు. మరోసారి MIM ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే స్వతంత్రులకు బీజేపీ మద్దతు తెలిపింది. దీంతో ఇండిపెండెంట్లు దత్తాత్రి (బీజేపీ రెబల్), ఖతీజా బేగం (MIM రెబల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అయ్యారు.
News February 16, 2026
అనకాపల్లి: బిల్ గేట్స్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో బిల్ గేట్స్‌తో జరిగిన సమావేశంలో అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను వారు వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను తెలియజేశారు.


