News August 25, 2025
VKB: మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన

స్వాతిని కిరాతకంగా నరికి చంపిన మహేందర్ రెడ్డి ఇంటికి రెండు రోజుల నుంచి తాళం వేసి ఉంది. బాధిత కటుంబసభ్యులు మహేందర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. వికారాబాద్ మండలం కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఇటీవలే స్వాతిని వివాహం చేసుకొని కిరాతకంగా హత్య చేయడంతో స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఆదోళన చేశారు. స్వాతిని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News August 25, 2025
NRPT: భూముల సమస్యలు కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి

భూములకు సంబంధించిన సమస్యలు కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. మొత్తం 19 అర్జీలు అందించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
News August 25, 2025
యాదాద్రి భువనగిరి: వైద్య సేవలు మెరుగుపరచాలి: కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్యులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సోమవారం ఆలేరు మండలం బహదూర్‌పేటలోని హెల్త్ వెల్‌నెస్ సెంటర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
News August 25, 2025
NRPT: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో బాల్య వివాహాలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం అనే నినాదంతో బాలిక విద్యపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు.