News December 16, 2025
VKB: మూడో విడత 157 గ్రామపంచాయతీలకు పోలింగ్

మూడో విడత వికారాబాద్ జిల్లాలో 157 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 157 గ్రామాలకు 18 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పరిగి 32, పూడూరు 32, కుల్కచర్ల 33, దోమ 36, చౌడాపూర్ 24, గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
Similar News
News December 16, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం

పెదవేగి జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (DPTC) నుండి కానిస్టేబుల్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం 10 ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూర్య చందర్రావు పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా నుండి సివిల్ కానిస్టేబుళ్లుగా 30 మంది, ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లుగా 116 మంది, మొత్తం 146 మంది పురుషులు, మహిళలు ఎంపికయ్యారు.
News December 16, 2025
భారత్‌లోనూ 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలా?

భారత్‌లో 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 60% పిల్లలు ప్రతిరోజూ దాదాపు 3 గంటలు వివిధ SM ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్ సైట్లలో గడుపుతున్నట్టు స్టడీలు వెల్లడిస్తున్నాయి. అది వ్యసనంగా మారి మానసిక ఆరోగ్య సమస్యలు, సైబర్ దాడుల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. <<18520645>>ఆస్ట్రేలియా<<>>లో చేసినట్టే భారత్‌లోనూ నిషేధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
News December 16, 2025
తిరుపతి, చిత్తూరు జిల్లాల TDP కొత్త బాస్‌లు వీరే.!

తిరుపతి, చిత్తూరు జిల్లాల TDP జిల్లా అధ్యక్షుల ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా అధిష్ఠానం షణ్ముగం, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వనబాక లక్ష్మీని నియమించినట్లు తెలుస్తోంది. నేతలు, నాయకులు నిర్ణయం మేరకు ఈ ఎంపిక జరిగిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.


