News August 26, 2025
VKB: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: అ.కలెక్టర్

రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లు జిల్లా వ్యవసాయ అధికారులతో అదనపు కలెక్టర్ యూరియా ఎరువులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వారంలోగా ఒక వెయ్యి 80 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని రైతులు అప్పటివరకు నానో యూరియా వాడాలన్నారు. రైతులకు యూరియా ఎరువులు వాడకంపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News August 26, 2025
సిరిసిల్ల: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. రామగిరి సతీశ్(35) అనే వ్యక్తి ఇటీవల బోరు వేసి, వరి కోత ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు అప్పులు చేశాడన్నారు. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఈనెల 21న పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందాడని, కేసు నమోదు చేశామని చెప్పారు.
News August 26, 2025
దివ్యాంగ బాలల కోసం 6 కొత్త భవిత పాఠశాలలు: కలెక్టర్

జనగామలో దివ్యాంగ బాలల కోసం 6 కొత్త భవిత పాఠశాలలు మంజూరైనట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రత్యేక వసతులతో 12 మండలాల్లో 9 కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నట్లు పేర్కొన్నారు. రూ.68.87 లక్షల నిధులతో భవనాలు, ఫర్నిచర్, సహాయక పరికరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనిపై ఆగస్ట్ 28న ALIMCO ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News August 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో రాబోయే కొన్ని రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు మరియు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. వర్షాలు కురిసే సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.