News April 13, 2025
VKB: రేపటితో ముగియనున్న గడువు.. మొరాయిస్తున్న సర్వర్

రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు OBMMS వెబ్సైట్ ఓపెన్ చేయగా సర్వర్ మొరాయిస్తూ కనిపించింది. మరోవైపు రేపటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు ఉండడంతో కుల ధ్రువీకరణ పత్రాల జారి పెండింగ్లో పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించి, దరఖాస్తు గడువును పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Similar News
News November 5, 2025
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News November 5, 2025
తిరుపతి: వారి ఇళ్లకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు

APSPDCL పరిధిలోని 9జిల్లాల్లో 100మంది విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకు ప్రయోగాత్మకంగా ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చి అధ్యయనం చేయాలని CMD శివశంకర్ అధికారులను ఆదేశించారు. ఈ-వ్యాలెట్ రీఛార్జింగ్, SMS అలెర్ట్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇది సక్సెస్ అయితే అందరి ఇళ్లకు వీటిని అమర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొబైల్ రీఛార్జ్‌లాగా చేసుకుంటే అందులోనే కరెంట్ బిల్లు కట్ అవుతుంది.
News November 5, 2025
జుక్కల్: పత్తి కూలీల కొరత.. రైతుల్లో గుబులు!

జుక్కల్ నియోజకవర్గంలో పత్తి రైతులకు కూలీల కొరత సమస్యగా మారింది. నియోజకవర్గంలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్, పిట్లం మండలాల్లో సాగు చేసిన పత్తి కోత దశకు చేరుకుంది. అయితే, కూలీలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో పత్తి తీతకు రూ.10 నుంచి రూ.12 వరకు చెల్లించినా, కూలీలు అందుబాటులో లేరు. అకాల వర్షాల వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


