News December 13, 2025

VKB: రేపే ఎన్నికలు.. అధికారులకు ఎస్పీ ఆదేశాలు

image

రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహమెహ్రా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రజలందరూ శాంతియుతంగా, స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల బందోబస్తుపై సూచనలు చేశారు.

Similar News

News December 25, 2025

స్క్రబ్ టైఫస్.. 20కి చేరిన మృతుల సంఖ్య

image

APలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్నాయి. తాజాగా బాపట్ల(D) పెదపులుగువారిపాలెంలో నాగబాబు(21) అనే యువకుడు ఈ వ్యాధితో మరణించాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌గా తేలింది. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 20కి చేరింది. కాగా ఈ పురుగు రాత్రి వేళల్లో <<18463813>>మనుషులను<<>> కుడుతుంది.

News December 25, 2025

మెడికల్ ఆఫీసర్ అభ్యంతరాలకు 27 వరకు గడువు

image

జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖమ్మం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు DM&HO తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేటి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ధ్రువపత్రాలతో DM&HO కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News December 25, 2025

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

image

ప్రొటీన్లు ఉండే పప్పులు చిన్నారులకు ఎక్కువగా ఇవ్వడం వల్ల అజీర్తి, జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. డ్రైఫ్రూట్స్ వంటివి 8,9 నెలల సమయంలో కొద్దిమొత్తంలో యాడ్ చేస్తే సరిపోతుందంటున్నారు. వీటితో పాటు రాగిజావ, యాపిల్‌, అరటిపండు వంటి వాటిని గుజ్జు చేసి పెట్టచ్చు. కాకపోతే అన్నీ ఒకేసారి కాకుండా పదిహేనురోజుల గ్యాప్ తీసుకొని పిల్లలకు అలవాటు చెయ్యడం మంచిదని సూచిస్తున్నారు.