News November 8, 2025

VKB: రైతులు దళారుల బారిన పడొద్దు: అదనపు కలెక్టర్

image

రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. తాండూర్‌లో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ.. వరి ధాన్యానికి ఏ గ్రేడ్‌కు రూ.2389, సన్న రకాలకు రూ.2369తో పాటు బోనస్‌గా రూ.500 చెల్లిస్తామని, సాధారణ రకాలకు రూ.2369 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. మొక్కజొన్నకు కూడా రూ.2400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Similar News

News November 8, 2025

APPLY NOW: MPMMCCలో ఉద్యోగాలు

image

వారణాసిలోని మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్‌ <>10 <<>>పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి బీఫార్మసీ, డీఫార్మసీ, BSc, MSc, ఇంటర్, డిప్లొమా, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 27- 45ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు రెజ్యూమ్, డాక్యుమెంట్స్ recruitment@mpmmcc.tmc.gov.inకు సెండ్ చేయాలి. ఈనెల 10,11,12వ తేదీల్లో ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

News November 8, 2025

పెందుర్తి: దొంగా-పోలీసు ఆడుదాం అంటూ చంపేసింది

image

పెందుర్తిలో సొంత అత్తనే కోడలు హత్య చేసిన విషయం <<18232660>>తెలిసిందే<<>>. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన తర్వాత తన కుమార్తె, అత్త కనకమహాలక్ష్మితో కలిసి దొంగా-పోలీసు ఆట ఆడుదామని లలితా దేవి పిలిచింది. అనంతరం అత్త కాళ్లకు తాళ్లు కట్టి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. విచారణకు వచ్చిన పోలీసులకు దేవుడి గదిలో దీపం పడడంతో కాలిపోయినట్లు స్టోరీ అల్లింది. దర్యాప్తు చేయగా.. అసలు నిజం బయటపడింది.

News November 8, 2025

21న సిరిసిల్ల-గోవా స్పెషల్ టూర్

image

ఆర్టీసీ సిరిసిల్ల డిపో నుంచి ఈనెల 21వ తేదీ శుక్రవారం గోవాకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్వహించనున్నారు. బీదర్, హుమ్నాబాద్, గానుగపూర్, మురుడేశ్వర్, గోకర్ణ, గోవా, పండరీపూర్, తుల్జాపూర్ సందర్శన అనంతరం తిరిగి 24న సిరిసిల్ల చేరుకుంటుంది. పెద్దలకు రూ.3900/-, పిల్లలకు 2750/- చార్జి ఉంటుందని, వసతి భోజన ఖర్చులు ప్రయాణికులు భరించాల్సి ఉంటుందని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.