News August 27, 2025
VKB: విత్తన గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

విత్తన గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందామని మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. వికారాబాద్‌లోని ఎన్ఎస్‌పీ కార్యాలయంలో ఆయన విత్తన గణపతి విగ్రహాలను మంగళవారం పంపిణీ చేశారు. గణపతి భక్తితో పాటుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విత్తన గణపతిని నీటిలో నిమజ్జనం చేయడంతో అది మొక్కగా పెరిగి సమాజానికి నీడను ఇస్తుంద తెలిపారు.
Similar News
News August 27, 2025
పంచాయతీలకు రూ.1,120 కోట్ల విడుదలకు సీఎం హామీ: పవన్

AP: సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నట్లు Dy.CM పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. రూ.1,120 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వినియోగిస్తూ కనీస మౌలిక వసతులు, సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
News August 27, 2025
KMR: ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. జిల్లాలోని ఆరు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News August 27, 2025
ఆగస్టు 27: చరిత్రలో ఈ రోజు

1908: ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం(ఫొటోలో)
1957: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జననం.
1963: నటి సుమలత జననం.
1972: రెజ్లర్ గ్రేట్ ఖలీ జననం.
2010: తెలుగు వైద్యుడు కంభంపాటి స్వయంప్రకాష్ మరణం