News March 12, 2025
VKB విద్యుత్ SEగా రవిప్రసాద్ బాధ్యతలు

విద్యుత్ శాఖ వికారాబాద్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా రవి ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సీగా పనిచేసిన లీలావతి నారాయణపేటకు బదిలీ కాగా ఆమె స్థానంలో నల్గొండ నుంచి డీఈగా రవి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 26, 2025
డీలిమిటేషన్: GHMCలో కొత్తగా 6 జోన్లు

TG: GHMC డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, డివిజన్లను 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌లను కొత్త జోన్లుగా పేర్కొంది.
News December 26, 2025
సిరిసిల్ల: కాంగ్రెస్ జిల్లా నూతన కార్యవర్గానికి దరఖాస్తుల ఆహ్వానం

కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ పదవుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 26న శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు కాంగ్రెస్ కార్యాలయంలో PCC అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంగితం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారు. ఆసక్తి గల వారు ఓటర్ IDతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని పార్టీ PRO తెలిపారు.
News December 26, 2025
జనగామ జిల్లాలో టాప్ న్యూస్

> ఈనెల 31న పాలకుర్తి సోమేశ్వరాలయంలో బహిరంగ వేలం: ఈవో
> బచ్చన్నపేట: గుండెపోటుతో జిపిఓ మృతి
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
> జిల్లాలో యూరియా కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్న రైతన్నలు
> రేపు కట్కూర్ లో పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు
> జనగామ: మహిళ కబడ్డీ టీం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేయింగ్ కిట్లను పంపిణీ చేశారు.


