News October 9, 2025

VKB: సైబర్ మోసాల బారిన పడి ప్రజలు మోసపోవద్దు: సీఐ

image

సైబర్ మోసాల బారిన పడి ప్రజలు ఆర్థికంగా మోసపోవద్దని సీఐ వెంకట్ తెలిపారు. బుధవారం మోమిన్‌పేట్ సీఐ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్‌లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని ప్రకటన చూసి నవాబుపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పెట్టుబడి పెట్టి రూ.6 లక్షల వరకు మోసపోయారని తెలిపారు. మరో వ్యక్తి కూడా ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బు పెట్టి మోసపోయారన్నారు. ప్రకటనలు చూసి మోసపోవద్దన్నారు.

Similar News

News October 9, 2025

VZM: విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు విజయనగరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఖతార్‌లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలకు అక్టోబర్ 13 వరకు, జర్మనీలో ఫిజియోథెరపీ, ఓటీ టెక్నీషియన్ ఉద్యోగాలకు అక్టోబర్ 15 వరకు, రష్యాలో మెటలర్జీ కోర్సుకు అక్టోబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News October 9, 2025

పెళ్లికాని అమ్మాయిలు నేడు ఉయ్యాల ఊగితే?

image

నేడు అట్లతద్ది. ఈ శుభదినాన పెళ్లికాని అమ్మాయిలు ఆనందంతో ఉయ్యాల ఊగితే సుగుణాలు గల వ్యక్తి భర్తగా వస్తాడని పండితులు చెబుతున్నారు. యుక్త వయస్సు గల ఆడపిల్లలు నేడు ఆటపాటలతో ఆనందంగా గడిపితే గౌరీదేవికి సేవ చేసినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. ఫలితంగా అమ్మవారి అనుగ్రహం లభించి కోరుకున్న వరుడు సొంతమవుతాడని నమ్మకం.
✍️ ప్రతిరోజు ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 9, 2025

గోదావరిఖని- తిరుపతికి ప్రత్యేక సూపర్ లగ్జరీ

image

ఈనెల 12న GDK నుంచి అరుణాచలం, తిరుపతికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేసినట్లు RTC DM నాగభూషణం తెలిపారు. పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,200 ఛార్జ్ నిర్ణయించామన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, తిరుపతి దర్శనాలు చేసుకొని GDK వస్తామన్నారు. ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరి 16న రాత్రి GDK చేరుకుంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలన్నారు