News April 14, 2025
VKB: స్పీకర్ ప్రసాద్ కుమార్ పర్యటన వివరాలు

తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
Similar News
News February 12, 2026
ఆ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేయండి: ఏలూరు కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహరం అందించాలని, మెనూ పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. పోలవరం(M) ఇటికలకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించని ఏజెన్సీ పనివారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసు జారీ చేయాలనీ అధికారులను ఆదేశించారు.
News February 12, 2026
విజయనగరం: పెట్రోలో కావలంటే..హెల్మెట్ ధరించాల్సిందే!

రహదారి భద్రతా నియమాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారించుటకు త్వరలో “నో హెల్మెట్ – నో పెట్రోల్ “ అనే నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీ దామోదర్ తెలిపారు. పట్టణంలో బుధవారం జరిగిన వాహన తనిఖీలను పరిశీలించారు. హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు పోతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5,000 ప్రోత్సాహకం ఉంటుందని స్పష్టం చేశారు.
News February 12, 2026
NRPT: తగ్గిన పోలింగ్ పర్సంటేజ్ అభ్యర్థుల్లో టెన్షన్

నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. వార్డుల్లో అనుకున్నదానికంటే తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావడంతో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది అనుచరులు, ముఖ్య నాయకులతో కలిసి లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తం 24 వార్డులకు గాను 96 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 21మంది స్వతంత్రులుగా పోటీ చేశారు.


