News March 15, 2025
VKB: హత్య కేసును ఛేదించిన పోలీసులు

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.
Similar News
News February 23, 2026
అఫ్గాన్‌పై వైమానిక దాడుల్లో 70 మంది మృతి: పాక్

అఫ్గానిస్థాన్‌పై జరిపిన వైమానిక దాడుల్లో 70 మంది ‘ఉగ్రవాదులు’ హతమైనట్లు పాక్ ప్రకటించుకుంది. పాక్‌లో ఇటీవల జరిగిన వరుస ఆత్మాహుతి దాడులకు ప్రతీకారంగానే నంగర్‌హర్, పక్తికా ప్రాంతాల్లోని ‘ఏడు ఉగ్రవాద శిబిరాల’పై విరుచుకుపడ్డామని చెప్పుకొచ్చింది. అయితే, పాక్ చేసిన ఈ ప్రకటనను అఫ్గానిస్థాన్ ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని మండిపడింది.
News February 23, 2026
పాలమూరు:రైతు భరోసా.. ఎప్పుడొచ్చేనో?

ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. MBNR-2,44,853, NGKL-3,29,128, GDWL-1,79,052, WNPT-1,87,633, NRPT-1,90,153 మంది రైతులు ఉన్నారు. నవంబర్ లోనే రైతు భరోసా అందవలసి ఉండగా.. భూముల సర్వే (ధరణి) ప్రక్రియ, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
News February 23, 2026
AIADMK హామీలు: మహిళలకు ₹2,000.. పురుషులకూ ఫ్రీ బస్సు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో AIADMK చీఫ్ పళనిస్వామి హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు ₹2,000 సాయం అందిస్తామన్నారు. మహిళలతో పాటు పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని, పేదలకు ఇళ్లు, ఆటో డ్రైవర్లకు సబ్సిడీలు ఇస్తామని ప్రామిస్ చేశారు. DMK సర్కార్ ఒక ‘ఫెయిల్యూర్ మోడల్’ అంటూ విమర్శలు గుప్పించారు.


