News February 15, 2025
VKB: హెడ్ కుక్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం

నవాబుపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో హెడ్ కుక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి తెలిపారు. ఎంఈవో మీడియాతో మాట్లాడుతూ.. నవాబుపేట కేజీబీవీలో హెడ్ కుక్ పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పారు. 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 19, 2025
‘రాజన్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి’

వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులు, భీమేశ్వర ఆలయంలో భక్తులకు మెరుగైన వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఆర్ అండ్ బీ సీఈ, శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు.
News December 19, 2025
టాప్10 ట్వీట్స్‌లో 8 మోదీ చేసినవే..

గడిచిన 30 రోజుల్లో ఇండియాలో అత్యధిక లైక్‌లు పొందిన టాప్ 10 ట్వీట్స్‌లో 8 ప్రధాని మోదీ చేసినవేనని ఎక్స్ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మోదీ భగవద్గీత అందిస్తున్న పోస్ట్‌కు 74వేల మంది లైక్ కొట్టారు. భారత్‌లో అత్యధిక లైక్స్ పొందిన ట్వీట్ల లిస్ట్‌లో మోదీ తప్ప మరో పొలిటీషియన్ లేరు. ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’లో అత్యధిక మంది ఫాలో (105.9M) అవుతున్న 4వ వ్యక్తిగా మోదీ రికార్డులకెక్కారు.
News December 19, 2025
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

నిర్దేశిత లక్ష్యాల మేరకు జిల్లాలో ఆయిల్ ఫాం సాగు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ సంవత్సరం నిర్దేశించిన 4500 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగులో 2604 రిజిస్ట్రేషన్, 905 ప్లాంటేషన్, 1403 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ అయిందన్నారు. ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేయించాలన్నారు.


