News March 17, 2025
VKB: 100% ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యం: DPO జయసుధ

వికారాబాద్ జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన 9.7 కోట్ల రూపాయల ఆస్తిపన్నును 100% వసూలు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 80% పైగా పన్నువసూలు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. మార్చ్ 31 నాటికి 100% పన్నులు వసూలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలన్నారు.
Similar News
News December 1, 2025
రష్యాపై ఆంక్షలు.. 17,700 KMs నుంచి ఇండియాకు ఆయిల్

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో కరీబియన్ దేశం గయానా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. దాదాపు 17,700 కిలోమీటర్ల దూరం నుంచి ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయి. 2 సూపర్ ట్యాంకర్లు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించాయి. ఒక్కో దాంట్లో 2 మిలియన్ బ్యారెల్స్ చొప్పున ఆయిల్ వస్తోంది. జనవరి నాటికి అవి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది.
News December 1, 2025
ఖోఖో పోటీల్లో ఉమ్మడి KNR టీంకు థర్డ్ ప్లేస్

సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో నిర్వహించిన 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖోఖో పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను కరీంనగర్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వై.మహేందర్ రావు, సీనియర్ క్రీడాకారులు, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్వారు అభినందించారు.
News December 1, 2025
HYD: RRRకు సర్వీస్ రోడ్డు లేదు!

సాధారణంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సర్వీస్ రోడ్లు ఉంటాయి. అయితే గ్రేటర్ HYD చుట్టూ నిర్మిస్తున్న RRRకు సర్వీస్ రోడ్డు నిర్మించడం లేదు. దీనికి బదులు యాక్సిస్ పాత్ రోడ్లు నిర్మించాలని NHAI నిర్ణయించింది. కనెక్టివిటీని పెంచడంతోపాటు సులువుగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ చుట్టూ ఎక్కువగా పొలాలు ఉండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్లతో రైతులకు పొలాలకు కూడా వెళ్లేందుకు వీలుగా ఉండనుంది.


