News February 22, 2025
VKB: 100 ఏళ్ల నుంచి ఎండిపోని ఊట

వంద సంవత్సరాల నుంచి జాంబాపూర్, కోటం గుట్ట తండాల మధ్యలో ఊట ఎండిపోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. దాదాపు 85 సంవత్సరాలుగా ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారని అంటున్నారు. బోర్లు, మిషన్ భగీరథ నీళ్లు వచ్చాక ఊట నీరు తాగడం మానేశారని తెలిపారు. ఇప్పుడు పశువుల దాహార్తిని ఈ ఊట తీరుస్తుందంటున్నారు.
Similar News
News November 6, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 6, 2025
అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గురువారం తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటిన అనంతరం ఆయన సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్ బాక్స్‌లను స్వయంగా తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కిట్ ఆర్టికల్స్ నిర్వహణలో పరిశుభ్రత, శ్రద్ధ కనబరిచిన కానిస్టేబుల్ జితేందర్‌కు అభినందించి రివార్డును మంజూరు చేశారు.
News November 6, 2025
WPL-2026.. రిటైన్ లిస్టు ఇదే..

WPL-2026 ఎడిషన్ కోసం ఢిల్లీలో ఈనెల 27న వేలం జరగనుంది. దీనికి ముందు 5 జట్లు పలువురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఆ జాబితా ఇదే..
RCB: స్మృతి మంధాన(3.5Cr), రిచా ఘోష్(2.75Cr), పెర్రీ(2Cr), శ్రేయాంక(60L)
MI: హర్మన్‌ప్రీత్, బ్రంట్, హేలీ, అమన్‌జోత్, కమలిని
DC: జెమీమా, షఫాలీ, అన్నాబెల్, మారిజాన్, నికి ప్రసాద్
UP వారియర్స్: శ్వేతా సెహ్రావత్
గుజరాత్: ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ


