News March 17, 2025
VKB: 100% ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యం: DPO జయసుధ

వికారాబాద్ జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన 9.7 కోట్ల రూపాయల ఆస్తిపన్నును 100% వసూలు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 80% పైగా పన్నువసూలు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. మార్చ్ 31 నాటికి 100% పన్నులు వసూలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలన్నారు.
Similar News
News February 20, 2026
హన్మక్కపల్లిలో చిరుత బీభత్సం

వేములవాడ మున్సిపల్ పరిధి హన్మక్కపల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి రైతు రోమాల భూమయ్యకు చెందిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. పాదముద్రలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఇది చిరుత పనేనని నిర్ధారించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘటనాస్థలికి చేరుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బాధిత రైతును పరామర్శించారు.
News February 20, 2026
ఎనిమిదేళ్లకే ఇంత టాలెంటా!

రణవీర్ సచ్‌దేవా(8) అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 4 ఏళ్లకే నాసా వెబ్‌సైట్‌లో చోటు సంపాదించిన ఈ బుడతడు.. 5 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన ‘యాపిల్ ప్రోగ్రామర్’గా గుర్తింపు పొందాడు. 6 ఏళ్లకే ‘టెడెక్స్’ స్పీకర్‌గా రికార్డు సృష్టించాడు. పర్యావరణంపై తనకున్న అవగాహనతో ‘గ్రీన్ యోధా’గా నిలిచాడు. తాజాగా ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ సమ్మిట్’లో కీనోట్ స్పీకర్‌గా ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించాడు.
News February 20, 2026
రోడ్డు ప్రమాదంలో సారపాక విద్యార్థి దుర్మరణం

ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సారపాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగ వెంకట్‌రెడ్డి(20) గుంటూరు హైవేపై బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొనడంతో కిందపడిన అతనిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి అకాల మరణంతో గ్రామంలో విషాదం నిండింది.


