News February 22, 2025

VKB: 100 ఏళ్ల నుంచి ఎండిపోని ఊట

image

వంద సంవత్సరాల నుంచి జాంబాపూర్, కోటం గుట్ట తండాల మధ్యలో ఊట ఎండిపోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. దాదాపు 85 సంవత్సరాలుగా ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారని అంటున్నారు. బోర్లు, మిషన్ భగీరథ నీళ్లు వచ్చాక ఊట నీరు తాగడం మానేశారని తెలిపారు. ఇప్పుడు పశువుల దాహార్తిని ఈ ఊట తీరుస్తుందంటున్నారు. 

Similar News

News November 6, 2025

సిరిసిల్ల: ‘రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు’

image

సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సిరిసిల్ల ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

News November 6, 2025

20న తిరుపతికి రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. 20న తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆమె దర్శించుకుంటారు. 21న తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అదేరోజు శ్రీ వరాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 6, 2025

సిరిసిల్ల: ‘రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు’

image

గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నటేశ్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని పాన్ షాప్, లాడ్జిలో గురువారం పోలీస్ జాగిలాలతో తనిఖీ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనేని లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి అమ్మినా, తాగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.