News March 16, 2025
VKB: 12,901 మంది విద్యార్థులకు 68 కేంద్రాలు

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఈవో రేణుకాదేవి తెలిపారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 12,901 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను నిర్వహించేందుకు 920 మంది అధికారులను నియమించినట్లు డీఈవో పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
రాజమండ్రి: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

విశాఖపట్నం -లింగంపల్లి, లింగంపల్లి- విశాఖపట్నం మధ్య రోజు నడిచే రైళ్లు శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లించడం జరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జన్మభూమి ఎక్సెప్రెస్ గోదావరి జిల్లాల ప్రజలకు ముఖ్య రవాణాగా ఉంది. నేటి నుంచి చర్లపల్లి – అమ్ము గూడ – సనత్ నగర్ మీదుగా దారి మళ్లించామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25వ తారీకు వరకు సికింద్రాబాద్ వెళ్లదని రైల్వే అధికారులు తెలిపారు.
News March 16, 2025
అల్లూరి: పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. అడ్డతీగల, అనంతగిరి, శివలింగంపురం, కొత్త బల్లుగూడ, చింతపల్లి, మోతుగూడెం, దేవీపట్నం, డుంబ్రిగూడ, జి. మాడుగుల, గూడెం, సీలేరు, బాకూరు, కూనవరం, నరసింగపేట, బోదులూరు, జోలాపుట్, సింగంపల్లి, గౌరీదేవిపేట, ఎస్‌విగూడెం, వై రామవరంలో కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 16, 2025
హోలీ రంగుల్లో షమీ కూతురు.. ముస్లిం పెద్ద ఆగ్రహం

పేసర్ షమీ కూతురు ఐరా హోలీ రంగుల్లో కనిపించడంతో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు రజ్వీ మండిపడ్డారు. షరియాలో లేని పనులు పిల్లలు చేయడాన్ని అనుమతించొద్దని షమీ, కుటుంబ సభ్యులకు సూచించారు. హోలీ హిందువుల పండుగ అని, ముస్లింలు చేసుకోవద్దన్నారు. షరియా తెలిసిన వారు హోలీ సెలబ్రేట్ చేసుకోవడం నేరమని చెప్పారు. ఇటీవల <<15669090>>షమీ<<>> ఉపవాసం ఉండకపోవడంపై రజ్వీ తీవ్రవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.