News April 11, 2025
VKB: ’15 నుంచి ప్రారంభించాలి’

ఈనెల 15 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోలపై ఐకెపీ, సీఎంఎస్ మెప్మా డీసీఎంఎస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 23, 2025
HYD: 25న బల్దియా సర్వసభ్య సమావేశం

మరో రెండున్నర నెలల్లో జీహెచ్ఎంసీ పాలకమండలి ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి మాత్రం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో చివరి సమావేశం కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు, కాంగ్రెస్కు మధ్య మాటల యుద్ధం తప్పకపోవచ్చని సమాచారం.
News November 23, 2025
ములుగు: ‘పనితీరు’కు పట్టం!

జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ‘పనితీరు’కే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. రెండోసారి ములుగు డీసీసీ అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ ఎన్నికయ్యారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుపు కోసం అన్ని తానై కృషి చేశారని పేరు ఉంది. కొత్తవారికి అవకాశం ఇస్తారని ఊహాగానాలు కొనసాగినప్పటికీ, అధిష్టానం పైడాకులకే మరోసారి పట్టం కట్టింది.
News November 23, 2025
వేములవాడ భీమేశ్వరాలయంలో మొక్కుబడి సేవలు

వేములవాడ రాజన్న ఆలయ అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి భక్తుల మొక్కుబడి సేవలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆది, సోమవారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే, భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదాన సత్రం పైభాగంలోని కళ్యాణ మండపంలో నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


