News April 11, 2025
VKB: ’15 నుంచి ప్రారంభించాలి’

ఈనెల 15 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోలపై ఐకెపీ, సీఎంఎస్ మెప్మా డీసీఎంఎస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News January 22, 2026
సిరిసిల్ల జిల్లాను ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ కష్టపడి సాధించుకున్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేసేందుకు కుట్ర చేయడం ప్రజలను, మేధావులను ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. జిల్లాల పునర్విభజన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తుందన్నారు.
News January 22, 2026
హీరో విజయ్ TVK పార్టీకి విజిల్ గుర్తు కేటాయింపు

తమిళ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. ఈమేరకు గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. త్వరలో తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఈ గుర్తుపై పోటీచేయనుంది.
News January 22, 2026
రహదారి భద్రత ప్రతి పౌరుడి బాధ్యత: విష్ణు చరణ్

రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు, క్రమశిక్షణ పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


