News March 19, 2025

VKB: 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పది పరీక్షలు: డీఈవో

image

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో పది పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

Similar News

News December 9, 2025

పాలకొండ: బైక్ ఢీకొని వ్యక్తి మృతి

image

పాలకొండ మండలం పణుకువలస వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేకుంది. పణుకువలస జంక్షన్ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న పొట్నూరు రామినాయుడును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన రామినాయుడుని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు పాలకొండ మండలం బుక్కూరు గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

News December 9, 2025

డెక్ భవనంలో మార్పులు!

image

సిరిపురంలో ఉన్న ది డెక్ భవనం ఇటీవలి కాలంలో మంచి క్రేజ్ పొందింది. మొత్తం 11 అంతస్తులు ఉన్న ఈ భవనంలో 6 అంతస్తులను రైల్వే జోన్ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో పాటు పలు కంపెనీల ఆఫీసులకు కేటాయించారు. మిగిలిన 5 అంతస్తులను పార్కింగ్ కోసం ఉంచినప్పటికీ, వాటిని అద్దెకు ఇవ్వడానికి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక పార్కింగ్ అంతస్తును ఆఫీస్ స్పేస్‌గా మార్చేందుకు వీఎంఆర్డిఏ సిద్ధమవుతోంది.

News December 9, 2025

సంగారెడ్డి: నేటి నుంచి వైన్స్ దుకాణాల బంద్

image

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేటి సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్‌లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.