News March 4, 2025
VKB: 40 శాతం వైకల్యం తప్పనిసరి: అసిస్టెంట్ ట్రైని కలెక్టర్

భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ALIMCO) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాల మొదటిరోజు ఎంపిక శిబిరం స్థానిక ధర్మ విద్యాలయం స్కూల్‌లో నిర్వహించారు. మొదటిరోజు శిక్షణ శిబిరానికి అసిస్టెంట్ ట్రైని కలెక్టర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ఉమా హారతి హాజరయ్యారు. ఆమె మాట్లడుతూ.. ఉపకరణాలు పొందేందుకు కనీసం 40 శాతం వైకల్యం తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.
Similar News
News September 13, 2025
విజయవాడ: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CRDA ఇంజినీరింగ్ విభాగంలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 25 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 15 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్(4), సూపరింటెండెంట్ ఇంజినీర్(8) పోస్టులు భర్తీ చేస్తున్నామని.. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలన్నారు.
News September 13, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 7,478 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. శనివారం ఉదయం ప్రాజెక్టులోకి 15,508 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 17.802కు గాను 17.369 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News September 13, 2025
మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 – 2010 మధ్య 4 సార్లు CMగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.