News March 19, 2025
VKB: CMకు ‘THANK YOU’ చెప్పిన ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు రూ.6000 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
సిరిసిల్ల డీఎస్పీగా నాగేంద్ర చారి నియామకం

సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే.నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.
News November 23, 2025
మధ్యవర్తిత్వం వేగవంతమైన న్యాయానికి కీలకం: జస్టిస్ లక్ష్మణ్

కేసుల భారాన్ని తగ్గించి, వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం (మెడియేషన్) కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో న్యాయవాదుల శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు బయటే తక్కువ ఖర్చుతో, సంబంధాలు కాపాడుతూ పరిష్కారం పొందవచ్చని సూచించారు. న్యాయవాదులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


