News March 19, 2025

VKB: CMకు ‘THANK YOU’ చెప్పిన ఎమ్మెల్యేలు

image

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు రూ.6000 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌‌కు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.

Similar News

News March 19, 2025

IPL: ఆ మ్యాచ్ రీషెడ్యూల్ ?

image

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. అదే రోజు శ్రీరామనవమి ఉండడంతో కోల్‌కతా వ్యాప్తంగా భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఊరేగింపులకు, ఇటు మ్యాచుకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారనుంది. ఈ కారణంతో మ్యాచును రీషెడ్యూల్ చేసే ఛాన్సుంది. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.

News March 19, 2025

దోచిన సొత్తును శ్మశానంలో దాచేవాడు: ఖమ్మం సీపీ

image

చాట్రాయి(M) చిత్తాపూర్‌కు చెందిన సురేందర్ దొంగతనాలు చేయడంలో టెక్నాలజీని ఉపయోగించాడని ఖమ్మం సీపీ సునీల్ దత్ మంగళవారం తెలిపారు. Google MAP ద్వారా సురేందర్ ఇంటిని మార్క్ చేసి, కొల్లగొట్టి, దొంగలించిన సొత్తును శ్మశానంలో దాచుకున్నాడని చెప్పారు. సదరు నిందితుడి నుంచి 461.19 గ్రాముల బంగారం, 425 గ్రాముల వెండి, రూ.3.32లక్షలు సీజ్ చేశామన్నారు. గత 3 నెలల్లో ఏలూరు, ప.గో.జిల్లాల్లో 43 కేసులు నమోదు అయ్యాయన్నారు.

News March 19, 2025

ఈ ఏడాది ఆ క్రేజీ మూవీకి పార్ట్-2!

image

క్రేజీ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి పార్ట్-2 తీయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలని పోస్ట్ చేశారు. దీంతో ENE2 రాబోతుందని సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది.

error: Content is protected !!