News March 27, 2025
VKB: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం VKB డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News November 26, 2025
జన్నారం: గంటలో స్పందించిన అధికారులు

జన్నారం బస్టాండ్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయని, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని బుధవారం సాయంత్రం 4 గంటలకు WAY2NEWSలో వార్త పబ్లిష్ అయింది. అధికారులు గంటలో స్పందించి బస్టాండ్లోని ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో పాటు మండలంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తీసేయించారు.
News November 26, 2025
HNK: ప్రయాణికుల సలహాల కోసం ‘డయల్ యువర్ డీఎం’

ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు వారి సూచనల కోసం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. తమ డిపో పరిధిలోని ప్రజలు ఈ నెల 27, గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 8977781103 నెంబరుకు ఫోన్ చేసి, డిపో అభివృద్ధికి విలువైన సలహాలను అందించాలని ఆయన కోరారు.
News November 26, 2025
ASF జిల్లాలో డిసెంబర్ 1 నుంచి పరీక్షలు

ASF జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు 2024-25 బ్యాచ్ అభ్యర్థులకు, గత బ్యాచ్లో అనుతీర్ణులైన అభ్యర్థులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


