News March 16, 2025
VKB: HMDA పరిధిలోకి 54 గ్రామాలు: DPO

హెచ్ఎండీఏ పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 54 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల12న ఉత్తర్వులు జారీ చేసిందని వికారాబాద్ DPO జయసుధ తెలిపారు. మోమిన్ పెట్ మండలంలో 3, పరిగి మండలంలో 4, పూడూరు మండలంలో 23, వికారాబాద్ మండలంలో 13, నవపేట మండలంలో 11 గ్రామపంచాయతీలను హెచ్ఎండీఏలో విలీనం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
FRO స్క్రీనింగ్ టెస్ట్.. 70.85% హాజరు

AP: రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇవాళ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసిందని APPSC ప్రకటించింది. 70.85% హాజరు నమోదైందని వెల్లడించింది. ఈ పరీక్ష కోసం 15,308 మంది దరఖాస్తు చేసుకోగా, 10,755 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. 7,620 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొంది.
News March 16, 2025
వచ్చే ఎన్నికల కోసమే స్టాలిన్ ఆరాటం: కిషన్ రెడ్డి

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆ రాష్ట్ర CM స్టాలిన్ త్రిభాషా విధానంపై రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘స్టాలిన్ వితండవాదం చేస్తున్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దదు. ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలని మొదట నిర్ణయించిందే మోదీ సర్కారు. రూపీ సింబల్‌ను మార్చడం తమిళనాడు ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.
News March 16, 2025
శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారా: భూమన

కడపలోని కాశీనాయన క్షేత్రాన్ని కూల్చడం దారుణమని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టైగర్ జోన్ కావడంతో కూల్చామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం చూస్తే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై CM నుంచి ఒక్క మాట కూడా రాలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌పై సైతం ఆయన విమర్శలు గుప్పించారు. ‘పవనా నంద స్వామి.. దీనిపై తమరు ఎందుకు మాట్లాడటం లేదు’ అని ప్రశ్నించారు.