News March 15, 2025
VKB: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
Similar News
News March 16, 2025
నా బలం నా పేరులో లేదు: మోదీ

‘నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల ప్రజల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలో ఉంది’ అని ప్రధాని మోదీ చెప్పారు. తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే దేశ ప్రజలందరికీ ఇచ్చినట్లేనని తెలిపారు. ఒక ఉద్దేశ్యంతో గొప్ప శక్తి తనను ఇక్కడి(భూమి)కి పంపిందని, తానెప్పుడూ ఒంటరి కాదన్నారు. బాల్యంలో తన తండ్రి టీ షాపు వద్దకు వచ్చిన వారి నుంచి చాలా నేర్చుకునేవాడినన్నారు. వాటినే ప్రజా జీవితంలో అప్లై చేసినట్లు పేర్కొన్నారు.
News March 16, 2025
చిత్తూరు: 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 16, 2025
విశాఖ జిల్లా పి.టి.ఐ.లు ప్రాంతీయ సదస్సు

సమగ్ర శిక్షాలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పి.టి.ఐ.లను రెగ్యులరైజ్ చేయాలని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,800 మంది, ఉమ్మడి విశాఖలో 460 మందికి పైగా ఈ విధుల్లో ఉన్నారన్నారు. తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేసి, బోధనేతర పనుల భారం తగ్గించాలని,ఇ.ఎస్.ఐ., ఇ.పి.ఎఫ్ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.