News March 27, 2025
VKB: జిల్లా వాసికి అత్యున్నతమైన సోషల్ సర్వీస్ అవార్డ్

సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అత్యున్నతమైన డాక్టరేట్ ఆఫ్ సోషల్ సర్వీస్ పురస్కారం అందుకోవడం సంతోషాన్ని కలిగించిందని జిల్లా వాసి జాటోత్ రవి నాయక్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని హానరరీ డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురి ప్రశంసలు వెలువెత్తాయి.
Similar News
News April 1, 2025
దుర్గి: పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

దుర్గి మండలంలో సామాజిక పెన్షన్‌ను కలెక్టర్ అరుణ్ బాబు స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ పంపిణిలో భాగంగా దుర్గి మండల కేంద్రంలో పెన్షన్‌లను కలెక్టర్ అరుణ్ బాబు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెల సక్రమంగా పెన్షన్సకాలంలో అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు.
News April 1, 2025
కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.
News April 1, 2025
‘విశాఖలో చంపి సాలూరులో వేలాడదీశారు’

సాలూరు మండలంలో గత నెల జరగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. సాలూరు మండలానికి చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. రాంబాబు యువతిని ఆరిలోవలోని ఓ రూములో చంపి ఫ్రెండ్స్ సాయంతో బైక్‌పై తీసుకెళ్లి సాలూరులోని జీడితోటలో చెట్టుకు చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యలా చిత్రీరించాడు.