News March 20, 2025

VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔TG KHO-KHO జట్టుకు ఎంపికైన పీడీ కే.కవిత(పుట్టపాడు)
✔GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
✔కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్
✔ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
✔VKB: ‘బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుని మార్చాలి’
✔VKB: కొనసాగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం
✔గట్టేపల్లి-నాగ సముందార్ మార్గంలో జింక మృత్యువాత
✔ఇంటి పన్ను..జిల్లాలోనే ప్రథమ స్థానంలో కోట్‌పల్లి

Similar News

News March 20, 2025

వరంగల్: భారీగా తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.12,700 పలికింది. 341 రకం మిర్చికి నిన్న రూ.12,800 ధర రాగా ఈరోజు రూ. 13,000 అయింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి క్వింటా బుధవారం రూ.16వేలు ధర పలకగా ఈరోజు రూ.15,500కి పతనమైనట్లు వ్యాపారులు తెలిపారు.

News March 20, 2025

ఈ నెల 29న సూర్య గ్రహణం

image

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.

News March 20, 2025

మదనపల్లె: భారీగా పడిపోయిన ధరలు.. KG రూ.11

image

మదనపల్లెలో కిలో టమాటాలు రూ.11 పలుకుతున్నాయి. వారం రోజులుగా ధరలు నిలకడగా ఉన్నాయి. టమాటా మార్కెట్లో మొదటి క్వాలిటి టమాటా కిలో రూ.11వరకు గురువారం పలికింది. పంట దిగుబడులు ఉన్నప్పటికీ రేట్లు పెరగలేదు. మార్కెట్‌కు ఆదివారం 108మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు మదనపల్లెకు తీసుకువచ్చారు. A గ్రేడ్ క్వాలిటీ రకం కిలో రూ.11, B గ్రేడ్ రకం రూ.10, C గ్రేడ్ రకం రూ.9 చొప్పున అమ్ముడుపోయాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

error: Content is protected !!