News March 26, 2025

VKB జిల్లాలో నేటి TOP NEWS..!

image

✔ VKB: ఇంగ్లిష్ పరీక్షకు 61 మంది డుమ్మా..! ✔ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: స్పీకర్ ✔VKB:బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు ✔VKB: GPO పోస్టులకు ఈనెల 26, 27న అవగాహన ✔పరిగిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు ✔ తాండూరు పుర సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ✔ పలుచోట్ల ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు ✔VKB జిల్లాలో గ్రామాల పేర్ల మార్పుకు సిద్ధం: మంత్రి సీతక్క ✔కేబినెట్ విస్తరణ.. VKBకు NO ఛాన్స్?.

Similar News

News March 29, 2025

రాష్ట్ర హైకోర్టు జడ్జితో జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు భేటీ

image

నెల్లూరు నగరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డిని శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్, నెల్లూరు ఆర్డీవో అనూష  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, నెల్లూరు ఆర్డీవోలు రాష్ట్ర హైకోర్టు జడ్జితో వివిధ అంశాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

News March 29, 2025

మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

మయన్మార్‌లో మళ్లీ భూకంపం వచ్చింది. ఆ దేశ రాజధాని నేపిడా సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తెలిపాయి. 24గంటల వ్యవధిలో 15సార్లు ఆ దేశంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. నిన్న 7.7 తీవ్రతతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ భూకంపానికి 1000 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

News March 29, 2025

ఈ నెల 31న రంజాన్ సందర్భగా గ్రీవెన్స్ రద్దు: VZM SP

image

రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న శెలవుగా ప్రకటించినందున జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రిసల్ సిస్టం’ను రద్దు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంకు మార్చి 31న ప్రజలెవరూ రావద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

error: Content is protected !!