News April 1, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ఘనంగా రంజాన్ వేడుకలు✔రంజాన్ EFFECT.. ఈద్గాల వద్ద భారీ బందోబస్తు✔ఈద్గా వద్ద నాయకుల సందడి✔ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి కావాలి: ముస్లింలు✔రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు,ఎస్పీలు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔తాండూరు: బషీరాబాద్‌లో యాక్సిడెంట్ ✔వికారాబాద్ జిల్లా @ 38 డిగ్రీలు✔రవీంద్ర భారతి ఉగాది వేడుకల్లో వికారాబాద్ ఒగ్గుడోలు
Similar News
News April 3, 2025
సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా పై హైకోర్టు మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కవితకు పునరావాసం కల్పించాలని కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పు ఇల్లీగల్ ఆర్డర్ అంటూ మహిళపై కలెక్టర్ కేసు బుక్ చేయించారు. దీంతో విషయాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News April 3, 2025
వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 3, 2025
గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్‌దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.