News April 3, 2025
VKB: పెద్దేముల్‌లో మిస్టరీగా మహిళ మృతి!

పెద్దేముల్ మండల కేంద్రంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. సదరు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. DSP బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందం వివరాలు సేకరించారు. మహిళ ముఖం, చేతిని కాల్చివేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Similar News
News April 4, 2025
జర్మనీకి కుంభమేళా పవిత్ర జలాలు

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన మహాకుంభమేళా నుంచి సేకరించిన పవిత్ర గంగా జలాలను యూపీ ప్రభుత్వం విదేశాలకు పంపుతోంది. మొదటగా మహా ప్రసాదం పేరుతో వెయ్యి బాటిళ్లను(ఒక్కోటి 250ml) జర్మనీలోని భక్తులకు ఎగుమతి చేసింది. ఇప్పటికే UPలోని 75 జిల్లాలతోపాటు దేశవ్యాప్తంగా 50వేల బాటిళ్లను సరఫరా చేసినట్లు తెలిపింది. కుంభమేళాకు హాజరుకాలేకపోయిన వారికి జలాలను పంపి ఈ మహావేడుకలో భాగం చేస్తున్నట్లు పేర్కొంది.
News April 4, 2025
మహబూబ్‌నగర్: ఘనంగా వేడుకలు నిర్వహించాలి: బీజేపీ

మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా ఆఫీస్‌లో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి 13 వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, 14 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ, జనగణన, జమిలి ఎన్నికలు, రైతుల సమస్యలపై బూత్ కమిటీలు వేసి చర్చించాలని అన్నారు.
News April 4, 2025
MBNR: కులవృత్తులు నిర్వీర్యమయ్యాయి: మాజీ మంత్రి

నేతన్నల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయన్నారు. చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లులు పెనుశాపంగా మారాయని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేనేత కార్మికులను ఆదుకున్నామన్నారు.