News April 6, 2025

VKB: షాపింగ్ మాల్‌పై మహిళా సంఘ నేతల ఫిర్యాదు

image

మహిళలకు రూ.9 చీర ఇస్తామని మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్ పైన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబెట్టి కనీస సౌకర్యాలు వాళ్లకు కల్పించకుండా మహిళలను అవమానపరచారన్నారు. పట్టణ కేంద్రంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని అన్నారు.

Similar News

News April 9, 2025

ట్రంప్ టారిఫ్స్.. భారత్ -చైనా ఏకమవ్వాలి: చైనా

image

ఇతర దేశాలపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను భారత్-చైనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని చైనా విదేశాంగ రాయబారి యు జుంగ్ కోరారు. ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారం ఎప్పుడూ పరస్పర లబ్ధి చేకూర్చేదిగా ఉంటుందని తెలిపారు. ఈ రెండు దేశాలు కలిసి నిలబడితే USA సుంకాల వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. కాగా అమెరికాపై విధిస్తున్న సుంకాలను రద్దు చేయాలని చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా..డ్రాగన్ దేశం లెక్కచేయలేదు.

News April 9, 2025

IPL: చెన్నైకు మరో ఓటమి

image

CSKతో మ్యాచులో 18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. ఈ సీజన్‌లో PBKSకు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి.

News April 9, 2025

హైదరాబాద్‌కు BYD రానట్లే..!

image

హైదరాబాద్‌కు చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD రాబోతోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కేంద్రమంత్రి వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలతో ఆ కంపెనీ వచ్చేందుకు అవకాశాల్లేవని స్పష్టమైంది. ప్రస్తుతానికి BYDకి డోర్లు తెరవబోమని ఆయన తేల్చి చెప్పారు. దేశ వ్యూహాత్మక, సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులను ఆహ్వానించాల్సి ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

error: Content is protected !!